‘మీపై 420 ఛీటింగ్ కేసు పెడతా’..జగన్
కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, కానీ ఏం నెరవేర్చిందని ప్రశ్నించారు మాజీ సీఎం జగన్. ఈ హామీల అమలుకు రూ.74 వేల కోట్లు కావలసి ఉండగా, ప్రభుత్వం ఏమాత్రం కేటాయించిందని విమర్శించారు. మోసం, దగా, అబద్దాలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబుపై 420 కేసు పెడతానని జగన్ పేర్కొన్నారు. ఈ విషయాన్ని నేనే స్వయంగా సోషల్ మీడియా పోస్టులు పెడతానని, దమ్ముంటే అరెస్టు చేసుకోమని సవాల్ చేశారు. “నేనే కాదు మా ఎమ్మెల్యేలు, కార్యకర్తలు అందరూ పోస్టులు పెట్టాలని పిలుపునిస్తున్నాను. ఎంతమందిని అరెస్టు చేస్తారో చేయండి” అంటూ వ్యాఖ్యానించారు. ‘అసెంబ్లీకి వెళ్లకపోతే నాపై అనర్హత వేటు వేయగలరా?’ అంటూ సవాల్ చేశారు. మాకు ప్రతిపక్ష హోదా ఎలా తెచ్చుకోవాలో తెలుసని, హైకోర్టుకు వెళతాం అని పేర్కొన్నారు. ‘మాకు ప్రజలే 40 శాతం ఓట్లు వేసి, ప్రతిపక్ష హోదా ఇచ్చారు. సభలో మాత్రం ఎందుకివ్వరు?’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.