బీఆర్‌ఎస్‌కు రూ.41 కోట్లు..గ్రీన్‌కో కార్యాలయంలో ఏసీబీ సోదాలు
బీఆర్‌ఎస్ పార్టీకి రూ.41 కోట్లు ఎలక్టోరల్ బాండ్లు ఇచ్చారన్న నేపథ్యంలో మాదాపూర్‌లోని గ్రీన్‌కో ఎనర్జీ కార్యాలయంలో తెలంగాణ ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఫార్ములా-ఈ రేసు వ్యవహారంలో గ్రీన్‌కో అనుబంధ సంస్థల బాండ్ల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. 2022 అక్టోబర్ 25న రేసు నిర్వహణకు ఒప్పందం జరిగింది. 2022 ఏప్రిల్‌లో రూ.31 కోట్లు, అక్టోబరులో రూ.10 కోట్లు గ్రీన్‌కో అనుబంధ సంస్థలు బాండ్లు సమకూర్చాయి. దీనిపై అవినీతి నిరోధక శాఖ దృష్టి సారించింది. మరోవైపు ఈ ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. ఈ నెల 9న విచారణకు రావాలని నిన్న కేటీఆర్‌కు నోటీసులు ఇచ్చారు.