NationalNews Alert

కరోనా తర్వాత 40 లక్షల మంది రాజీనామా  

కరోనా సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. ప్రపంచాన్ని మొత్తం అస్తవ్యస్తం చేసింది. ఎంతోమంది మరణాలకు కారణమైంది. అంతే కాకుండా ఇంకా ఎన్నో ఆరోగ్య సమస్యలకు దారీతీసింది. చాలామంది లాంగ్ కోవిడ్ లక్షణాలతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీని ప్రభావం ఉద్యోగుల మీద కూడా ఇది భారీ ప్రభావన్ని చూపించిందనే చెప్పాలి. తాజాగా కరోనా ,తర్వతా ఉద్యోగాల స్ధితిగతులపై మెకెన్సీ సర్వే నిర్వహించింది. అయితే ఈ సర్వేలో చాలా విషయాలు తెలియజేశారు. కరోనా తర్వతా పని ఒత్తిడి తట్టకోలేక 40 శాతం మంది ఉద్యోగం పట్ల ఆసక్తి కోల్పతున్నారని తెలిపింది. కేవలం అమెరికాలోనే 40 లక్షల మంది ఉద్యోగానికి రాజీనామా ప్రకటించినట్టు పేర్కొంది. రీజైన్ చేసేవారిలో ఎక్కువ శాతం మంది రిటైల్ , పైనాన్స్ , ఇన్సూరెన్స్ చెందిన వారిగా గుర్తించింది. ఇక టెక్ కంపెనీలలో ఇన్ఫోసిస్ నుండి 28.4 శాతం , విప్రో 23.3 శాతం , టెక్‌ మహీంద్ర 22 శాతం , టీసీఎస్ 19.7 శాతం మంది రాజీనామా చేసినట్టు సమాచారమిచ్చింది.