ఏపీలో 4 వేల డిజిటల్ లైబ్రరీలు
ఏపీలో త్వరలో 4వేల డిజిటల్ లైబ్రెరీలు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. ప్రతి గ్రామ, వార్డు సచివాలయానికి ఒక గ్రంథాలయం ఉండేలా ప్రభుత్వం ఆలోచనలు చేస్తుందని తెలిపారు. మరుతున్న కాలానికి అనుగుణంగా డిజిటల్ లైబ్రరీలను ఏర్పాటు చేస్తామన్నారు. అదే విధంగా ఇప్పటివరకు రాష్ట్రంలో ఉన్న గ్రంథాలయాల అప్‌గ్రెడేషన్ , మరమ్మతులు వంటి అంశాలపై గ్రంథాలయాల చైర్మన్లు , కార్యదర్శులను ఈ సందర్భంలో భాగంగా మంత్రి ఆదేశించారు.