Home Page SliderInternational

అమెరికాలో అరెస్ట్ అయిన 4గురు తెలుగువారు

అమెరికాలో నలుగురు తెలుగువారు అరెస్ట్ అయ్యారు.కాగా హ్యూమన్ ట్రాఫిక్ కేసులో పోలీసులు వారిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.ఈ కేసులో కొలిన్ కౌంటీలోని ప్రధాన నిందితుడు సంతోష్ కట్కూరి నివాసంలో 15 మంది మహిళలను ప్రిన్‌స్టన్ పోలీసులు గుర్తించారు. అయితే సంతోష్ సతీమణి ద్వారకా వీరిని తమ షెల్ కంపెనీలకు పనిచేయించుకున్నట్లు అధికారులు వెల్లడించారు. కాగా ఈ కేసులో చందన్,అనిల్ అనే మరో ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ రాకెట్‌లో 100మంది వరకు ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.