ప్రకాశం జిల్లాలో కారు, ఆటో ఢీ..4గురు మృతి
ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెద్దారవీడు మండలం దేవరాజు గట్టు వద్ద జాతీయ రహదారిపై ఒక కారు, ఆటో ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి. సమాచరం తెలుసుకుని పోలీసులు కేసు నమోదు చేశారు. సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.