Andhra PradeshNewsNews Alert

నివురుగప్పిన నిప్పులా కుప్పం.. మూడో రోజు బాబు పర్యటన ప్రశాంతం

అంతా ప్రశాంతం అనుకంటే ఒక్కసారిగా విధ్వంసం చోటు చేసుకుంది. పరస్పర దాడులు జరిగాయి. కుప్పం అంతా ఉద్రిక్తంగా మారింది. బాబు మండి పడ్డాడు. వైపీపీ శ్రేణులు కూడా ప్రత్యారోపణలు చేశాయి. జరిగిన పరిణామాలకు నువ్వంటే నువ్వే కారణమని ఆడి పోసుకున్నారు. రెండు పార్టీలు నిరసనలకు దిగాయి. ఇద్దరికీ సర్ది చెప్పేందుకు పోలీసులు నానా ఇబ్బందీ పడ్డారు. అయినా అధికారంలో ఉంది వైసీపీ కనుక కొద్దిగా వారి పక్షానే మొగ్గు చూపారు. ఇదీ నిన్నటి కుప్పం పరిస్ధితి. ఇవాళ మూడోరోజు చంద్రబాబు.. కృష్ణానందపల్లి, గుండ్లనాయనపల్లి, కొత్తూరులో పర్యటించారు. ప్రజల నుంచి పెద్ద ఎత్తున అర్జీలు స్వీకరించారు. నివురు గప్పిన నిప్పులా ఉన్న కుప్పంలో ముందస్తు జాగ్రత్తగా భారీగా పోలీసులను మోహరించారు. తాము ఎవరికీ భయపడేది లేదని .. రానున్నది తమ ప్రభుత్వమేనని బాబు అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.