Home Page SliderNational

ఏకలవ్య స్కూల్స్‌లో 38 వేల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

కేంద్రప్రభుత్వ ఉద్యోగాలతో సమానమైన ఏకలవ్య ఆదర్శ  పాఠశాలలో భారీ స్థాయిలో 38 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఈ ఏడాది ఫిబ్రవరి 1న కేంద్రప్రభుత్వం దేశంలో 740 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దాని ప్రకారం 3.5 లక్షల మంది ఆదివాసీ విద్యార్థులకు విద్యాబోధన అందిస్తారు. ఈ స్కూల్స్ కోసం భారీగా రిక్రూట్‌మెంట్ చేపట్టారు. దాదాపు 38 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడింది.

దీనిలో ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, పీజీటీ, టీజీటీ, ఆర్ట్, మ్యూజిక్, పీఈటీ, లైబ్రేరియన్, కౌన్సిలర్, స్టాఫ్ నర్సులు, హాస్టల్ వార్డెన్, అకౌంటెంట్లు వంటి పోస్టులతో పాటు ఎలక్ట్రీషియన్, ప్లంబర్, చౌకీదార్, స్వీపర్, డ్రైవర్ వంటి పోస్టులు కూడా భర్తీ చేస్తున్నారు.

వీటికి కావలసిన విద్యార్హతలు, అనుభవం, వయో పరిమితి వంటి అంశాలకు https://emrs.tribal.gov.in/ అనే వెబ్‌సైట్‌ను చూడవచ్చు.