బెట్టింగ్ ప్రియులకు బ్యాడ్ న్యూస్..
పన్ను ఎగ్గొడుతున్న ఆన్ లైన్ గేమింగ్ వెబ్ సైట్లపై కేంద్ర ఆర్థిక శాఖకు చెందిన DGGI కొరడా ఝుళిపించింది. 357 బెట్టింగ్ వెబ్ సైట్లను బ్లాక్ చేసింది. ఆయా సంస్థలకు చెందిన 2,400 అకౌంట్లలోని రూ.126 కోట్లను సీజ్ చేసింది. దాదాపు 700 విదేశీ సంస్థలు ఆన్ లైన్ గేమింగ్, బెట్టింగ్ , గ్యాంబ్లింగ్ వ్యవహారాలను నడిపిస్తున్నట్లు గుర్తించామని అధికారులు తెలిపారు. ఇలాంటి వాటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరో వైపు బెట్టింగ్ లకు పాల్పడుతున్న వారు దిక్కు తోచని స్థితిలో ఉన్నారు.

