ఆ రాష్ట్రంలో మహిళలకు 35 శాతం రిజర్వేషన్లు
మహిళలకు సాధికారత కోసం మధ్యప్రదేశ్ రాష్ట్రం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నియామకాలలో మహిళలకు ఉన్న 33 శాతం రిజర్వేషన్‌ను 35 శాతం పెంచుతూ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. దీనితో ఫారెస్ట్ డిపార్టమెంట్ మినహా అన్ని ప్రభుత్వ నియామకాలలోనూ మహిళలకు 35 శాతం రిజర్వేషన్లు అమలు కానున్నాయి.

