Breaking NewsHome Page SliderNationalNews Alerttelangana,

తెలంగాణకు రూ.34వేల కోట్ల నిధులు

మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రైల్వేస్టేషన్లన్నీ పరిశుభ్రంగా మారాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు.సోమ‌వారం చ‌ర్ల‌ప‌ల్లి రైల్వే టెర్మిన‌ల్ ప్రారంభోత్స‌వంలో మ‌రో కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డితో క‌లిసి ఆయ‌న ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.గ‌తంలో రైల్వే స్టేష‌న్లు అత్యంత అప‌రిశుభ్రంగా,నాణ్య‌త లోపించి ఉండేవ‌ని మోదీ వ‌చ్చాక రైల్వే ట్రాక్‌లు,స్టేష‌న్ల స్వరూపం పూర్తిగా మారిపోయింద‌న్నారు.తెలంగాణ‌కు గ‌త 10ఏళ్ల వ్య‌వ‌ధిలో రూ.34వేల కోట్ల నిధులు మంజూరు చేసిన ఘ‌న‌త ఎన్టీయే ప్ర‌భుత్వానిదే అన్నారు. ఇందులో రూ.2వేల కోట్లు రైల్వే స్టేష‌న్ల అభివృద్దికే కేటాయించార‌న్నారు. అనంత‌రం మోదీతో క‌లిసి వ‌ర్చువ‌ల్‌గా టెర్మిన‌ల్‌ని ప్రారంభించారు.ఈ సంద‌ర్భంగా మోదీ ప్ర‌జ‌ల‌నుద్దేశించి మాట్లాడారు.