నకిలీ సర్టిఫికేట్ల కేసులో 34 మందికి జైలుశిక్ష
అనంతపురం కోర్టులో నకిలీ సర్టిఫికేట్ల విషయంలో 34 మందికి జైలుశిక్ష విధించారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఈ ఫేక్ సర్టిఫికేట్ల వ్యవహారంలో ముగ్గురు ప్రధాన నిందితులకు మూడేళ్ల జైలుశిక్ష,30 వేల రూపాయలు జరిమానా విధించగా, మిగిలిన వారికి ఆరు నెలల జైలుశిక్ష, 2,500 రూపాయల జరిమానా విధించింది కోర్టు. గతంలో ప్రముఖ యూనివర్సిటీల సర్టిఫికేట్లను తయారు చేస్తూ, వాటిని లక్షల రూపాయలకు విక్రయించిన ముఠాను గుర్తించారు పోలీసులు. వీరు ఏపీ, తెలంగాణాలతో పాటు, దేశవ్యాప్తంగా కొన్ని యూనివర్సిటీల సర్టిఫికేట్లు నకిలీవి తయారుచేస్తున్నారు. వాటిని కావలసిన వారితో బేరాలు పెట్టుకుని ఎంబీయే, డిగ్రీ సర్టిఫికేట్స్ మాత్రమే కాకుండా ఎంబీబీఎస్, ఇంజనీరింగ్ వంటి కోర్సులకు కూాడా సంబంధించిన సర్టిఫికేట్స్ అందజేస్తున్నారు. వాటి కోసం 50 వేల రూపాయల నుండి మూడు లక్షల రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. వారిని అదుపులోకి తీసుకుని కోర్టుకు తరలించడంతో వారికి ఈ శిక్షలు ఖరారు చేసింది న్యాయస్థానం.