హస్టల్‌లో పుడ్ పాయిజన్ 31 మంది విద్యార్థినులకు తీవ్ర అస్వస్థత
వరంగల్ జిల్లా వర్ధన్న పేట ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఫుడ్‌పాయిజన్ కావడంతో 31 విద్యార్థినులు ఆస్పత్రి పాలయ్యారు. రాత్రి భోజనంలో ఓ విద్యార్థినికి చనిపోయిన బల్లి కనిపించింది. అప్పటికే కొంత మంది విద్యార్థినులు భోజనం చేశారు.ఆ తర్వాత కొద్ది సేపటికే కొందరు విద్యార్థినులు వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అప్రమత్తమైన హాస్టల్ సిబ్బంది వెంటనే వర్ధన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మొత్తం 31 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురవ్వగా.. వారిలో 12 మంది పరిస్థితి ఆందోళనకరంగా మారింది.

ప్రాథమిక చికిత్స అందించి కొందరిని తిరిగి హాస్టల్‌కు పంపించారు. 31 మందిని మాత్రం ఆస్పత్రిలోనే ఉంచారు. అందులో 12 మందిని మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఎంజీఎంకు తరలించారు. మిగతా విద్యార్థినులకు వర్ధన్నపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. విద్యార్థినుల ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఘటనపై సీరియస్ అయిన కలెక్టర్ రిపోర్ట్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.