జోయాలుకాస్ 305 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసిన ఈడీ
ప్రముఖ ఆభరణాల చైన్ సంస్థ జోయాలుకాస్‌కు చెందిన ₹ 305.84 కోట్ల విలువైన ఆస్తులను ఐదు రోజుల విచారణ తర్వాత ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ శుక్రవారం జప్తు చేసింది. ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ నిబంధనలను ఉల్లంఘించి.. సంస్థ వ్యాపారం చేస్తోందని ఈడీ ఆరోపించింది. హవాలా మార్గాల ద్వారా భారతదేశం నుండి దుబాయ్‌కి భారీ మొత్తంలో నగదును బదిలీ చేసి, ఆ తర్వాత 100 శాతం జోయాలుకాస్ వర్గీస్‌కు చెందిన జోయల్లుకాస్ జ్యువెలరీ LLC, దుబాయ్‌లో పెట్టుబడి పెట్టిందని నిర్ధారించింది. అటాచ్ చేసిన ఆస్తులలో ₹ 81.54 కోట్ల విలువైన 33 స్థిరాస్తులు ఉన్నాయి. త్రిస్సూర్‌లోని శోభా సిటీలో స్థలం, నివాసం ఉన్నాయి. 91.22 లక్షల విలువైన మూడు బ్యాంకు ఖాతాలు, ₹ 5.58 కోట్ల విలువైన మూడు ఫిక్స్‌డ్ డిపాజిట్లు, 217.81 కోట్ల విలువైన జోయల్లుకాస్ షేర్లను కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సీజ్ చేసింది. ఈడీ విచారణతో… ₹ 2,300 కోట్ల పబ్లిక్ ఆఫర్, IPOని మంగళవారం జోయాలుకాస్ ఉపసంహరించుకుంది. కంపెనీ తన IPO పత్రాలను “త్వరలో, మార్కెట్ పరిస్థితులకు లోబడి” రీఫైల్ చేయడానికి ప్రణాళికలు వేసిందని చీఫ్ ఎగ్జిక్యూటివ్ బేబీ జార్జ్ మంగళవారం రాయిటర్స్‌తో అన్నారు. దక్షిణ భారతదేశంలో ప్రముఖంగా ఉన్న ఈ సంస్థ దేశ వ్యాప్తంగా 68 నగరాల్లో షోరూమ్‌లను నిర్వహిస్తోంది.


