30 మందిపై తేనెటీగలు దాడి.. తీవ్ర గాయాలు
పెద్దపల్లి జిల్లా మంథని జూనియర్ కళాశాల మైదానంలో సుమారు 30 మంది కరాటే నేర్చుకునే పిల్లలు, వాకర్స్, క్రీడాకారుల పై తేనెటీగలు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారు. కళాశాల మైదానంలో చెట్లపై తేనెటీగల స్థావరం ఉండగా, ఏమైందో ఏమో కానీ ఒకసారిగా తేనెటీగలు కరాటే నేర్చుకోవడానికి వచ్చిన బాలుడు పై దాడి చేశాయి. అదే సమయంలో చుట్టుపక్కల ఉన్నవారు బాలుడిని కాపాడడానికి ప్రయత్నం చేయగా వారిని కూడా తేనెటీగలు గాయపరిచినట్లు బాధితులు తెలిపారు. గాయపడిన వారిని వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

