మెట్రో ట్రైన్‌కి ప్రారంభం నుండి 3 కోచ్‌లే, బోగీలు పెంచరా..?
టిజి: హైదరాబాద్ మెట్రో ట్రైన్‌లో ప్రయాణం చేసేందుకు ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని నగరవాసులు ముఖ్యమంత్రి రేవంత్‌కు ఫిర్యాదులు చేస్తున్నారు. రద్దీ భారీగా పెరిగిందని, మెట్రోలో ఇసుకేస్తే రాలనంత జనం ఉంటున్నారని తెలిపారు. అమీర్‌పేట్ మెట్రోస్టేషన్‌లో ఎంత రద్దీగా ఉందో చూడాలంటూ ఫొటోలను షేర్ చేస్తున్నారు. కోచ్‌లు పెంచేలా మెట్రో అధికారులను ఆదేశించాలని ముఖ్యమంత్రిని కోరుతున్నారు. ఇంత రష్‌గా ఉంటే ఆఫీసులకు వేళకు చేరుకోలేకపోతున్నామని చాలామంది ఎంప్లాయీస్ తమ గోడు ముఖ్యమంత్రికి వెళ్లబోసుకున్నారు తమ ఫిర్యాదులో. అయ్యా సీఎం గారు వెంటనే తగు చర్యలు తీసుకోండి అని మనవి చేస్తున్న ఎంప్లాయీస్.