Home Page SliderTelangana

బీఆర్ఎస్ పాలనలో తెలంగాణాలో 29 మెడికల్ కాలేజీలు:హరీశ్‌రావు

తెలంగాణా ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు తాజాగా జరిగిన శాసనసభ సమావేశాల్లో కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడకముందు తెలంగాణాలో కేవలం 5 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయన్నారు. అయితే ఇప్పుడు వాటి సంఖ్య 29కి చేరిందని మంత్రి హరీశ్ రావు తెలిపారు. కాగా తెలంగాణాలో 2008లో వచ్చిన రిమ్స్,2013లో వచ్చిన నిజామాబాద్ కాలేజీలు తమ ఒత్తిడి వల్లే ఏర్పాటు చేశారని ఆయన వెల్లడించారు. ఈ విధంగా తెలంగాణాలో వైట్ కోట్ రివల్యూషన్ తీసుకువచ్చామని హరీశ్‌రావు పేర్కొన్నారు. దీంతో తెలంగాణా రాష్ట్రం దేశం మొత్తానికి వైద్యులను సరఫరా చేసే స్థాయికి చేరిందని మంత్రి హరీశ్‌రావు కొనియాడారు.