రాష్ట్రంలో కొత్తగా 2777 రేషన్ షాపులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 2777 రేషన్ షాపుల ఏర్పాటుకు ఏపీ మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం ముగిసింది. కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. సెబ్ రద్దు చేసి ఎక్సైజ్ శాఖను పూర్తిగా పునర్ వ్యవస్థీకరించాలని నిర్ణయించింది. మాజీ సీఎం జగన్ పేరుతో ముద్రించబడిన పట్టాదారు పాసు పుస్తకాలను టీడీపీ ప్రభుత్వం రద్దు చేసింది. ప్రభుత్వ చిహ్నం రాజముద్రతో కూడిన 21.86 లక్షల కొత్త పాస్ పుస్తకాలు జారీ చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీంతో పాటుగా రాష్ట్రంలోని వివాదాస్పద భూముల రిజిస్ట్రేషన్ల నిలిపివేతకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.