Home Page SliderInternationalNews

లాస్ ఏంజెల్స్‌ను వీడని కార్చిచ్చు..భారీ ప్రాణనష్టం

అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌ను కార్చిచ్చు వీడడం లేదు.  అక్కడి అడవులలో మరోసారి మంటలు చుట్టుముట్టాయి. సమీప నగరాలకు వ్యాపించి, భారీ నష్టం కలిగిస్తున్నాయి. లాస్ ఏంజిల్స్ కార్చిచ్చులో ఇప్పటి వరకూ 27 మంది మృతి చెందగా, పలువురు గల్లంతయ్యారు. 22 వేల ఇళ్లు అగ్నికి ఆహుతి అయ్యాయని అధికారిక లెక్కలు చెప్తున్నాయి.  లాస్ ఏంజిల్స్ కౌంటీలో కాస్టిక్ సరస్సు సమీపంలోని కొండ ప్రాంతంలో ముందుగా మంటలు చెలరేగాయి. ఇవి కేవలం 2 గంటలలో 5వేల ఎకరాలకు వ్యాపించి, బూడిద చేశాయి. ఆ సరస్సు చుట్టుపక్కల ప్రాంతాల నుండి సుమారు 20 వేల మందిని ఖాళీ చేయించారు.  అక్కడ గంటకు 30 మైళ్ల వేగంతో గాలులు వీస్తున్న కారణంగా మంటలు ఆర్పడం అగ్నిమాపక దళానికి ఇబ్బందిగా మారింది.