ప్రతీ కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా
ఏపీలోని ప్రతీ కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా పథకాన్ని తీసుకురాబోతున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో మంత్రి పయ్యావుల కేశవ్ ప్రకటించారు. ఈ పథకం ఈ ఏడాది నుండి అమల్లోకి రాబోతుందని పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా పేద, మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. అలాగే ఆరోగ్య శాఖకు కూడా రూ.19,264 కోట్లు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు.