Andhra PradeshBusinessInternational

తిరుమలలో హల్ చల్ చేసిన గోల్డెన్ ఫ్యామిలీ

తిరుమలకు వచ్చేటప్పుడు సాదాసీదాగా రావడం పరిపాటి. అక్కడ స్వామిని కొలిచి మొక్కలు సమర్పించుకోవడం ఆనవాయితీ. కానీ పూణేకు చెందిన భక్తులు వెరైటీగా ఉన్నారు. బడాబాబులంతా సంచుల నిండా బంగారంతో స్వామిని కొలుస్తారు. కానీ వీళ్లు మాత్రం వంటినిండా బంగారం వేసుకొనిచ్చి స్వామి దర్శనం చేసుకున్నారు. పూణెకు చెందిన సన్నీ వాక్ చౌరి ,సంజయ్ గుజరాత్ లు తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవడాని “25 కేజీల గోల్డ్ “ధరించి వచ్చి సందడి చేసారు. వారిని చూడడానికి భక్తులంతా పోటీ పడ్డారు. ఇక ఆ బంగారాన్ని కాపాడుకోడానికి 15 మంది బాడీగార్డులను సైతం పెట్టుకున్నారట..