ఈ ఏడాది చివరకు ఇండియాలో ఏకే 203 రైఫిల్స్
యూపీలోని అమేథీ జిల్లాలోని కోర్వా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో రష్యాకు చెందిన కలాష్నికోవ్ అసాల్ట్ రైఫిల్స్‌ను ఉత్పత్తి చేయడానికి ఇండో-రష్యా రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ 2019లో స్థాపించారు. ఈ ఫ్యాక్టరీలో ఇండో-రష్యన్ జాయింట్ వెంచర్ ద్వారా AK-203 అసాల్ట్ రైఫిల్స్ ఉత్పత్తి ఈ ఏడాది చివరి నాటికి ప్రారంభమవుతుందని రష్యా అధికారులు చెప్పారు. కోర్వా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ 2022 చివరి నాటికి కలాష్నికోవ్ AK-203 అసాల్ట్ రైఫిల్స్ తయారీని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉందని రోసోబోరోనెక్స్‌పోర్ట్ డైరెక్టర్ జనరల్ అలెగ్జాండర్ మిఖీవ్ తెలిపారు.

రోసోబోరోనెక్స్‌పోర్ట్ అనేది రష్యా ప్రభుత్వ-రక్షణ సంస్థ. ఇది విదేశాలతో సహా వివిధ కీలక సైనిక ప్రాజెక్టులను పర్యవేక్షిస్తుంది. భారతదేశంలో రష్యన్ అసాల్ట్ రైఫిల్స్ ఉత్పత్తి 100 శాతం స్థానికంగా చేయాలని భావిస్తున్నట్టు మిఖీవ్ చెప్పారు. అంతేకాకుండా, భవిష్యత్తులో, జాయింట్ వెంచర్ ఉత్పత్తిని పెంచవచ్చని… కలాష్నికోవ్ అసాల్ట్ రైఫిల్ ప్లాట్‌ఫారమ్ ఆధారంగా అధునాతన రైఫిల్స్‌ను తయారు చేయడానికి ఉత్పత్తి సౌకర్యాలను ఆధునీకరించవచ్చన్నారు.

రోసోబోరోనెక్స్‌పోర్ట్ AK 203 రైఫిల్స్‌కు యుద్ధ సమయంలో ఎక్కడ్నుంచి ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చని… సమర్థవంతంగా ఉపయోగించచ్చని చెబుతున్నారు. అక్టోబర్ 18 నుంచి 22 వరకు గాంధీనగర్‌లో జరిగే డెఫ్‌ఎక్స్‌పోకు కంపెనీ హాజరవుతోంది. ఎగ్జిబిషన్ సమయంలో, దేశంలోని సాయుధ దళాలతోపాటు, దేశంలో చట్టరీత్యా ఉపయోగించేవారికి AK-203 సరఫరా కోసం ప్రభుత్వం నుంచి అనుమతి కోసం చూస్తున్నట్టుగా కంపెనీ పేర్కొంది.

