Home Page SliderNational

సెప్టెంబర్ 30 తర్వాత కూడా 2 వేల నోట్లు చట్టబద్ధమే-ఆర్బీఐ గవర్నర్

2 వేలు నోటు మార్చుకునేందుకు తొందరొద్దన్న ఆర్బీఐ గవర్నర్

₹ 2,000 నోట్లను తిరిగి ఇవ్వడానికి లేదా మార్చుకోవడానికి ఎవరూ తొందరపడకూడనక్కర్లేదన్నారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్. ప్రజలు అధిక విలువ కలిగిన నోట్లను వదులుకోవడానికి బ్యాంకులను సంప్రదించడం ప్రారంభించడానికి ఒక రోజు ముందు ఆయనీ వ్యాఖ్యలు చేశారు. సెప్టెంబరు 30 తర్వాత కూడా ఈ నోట్లు చట్టబద్ధంగానే కొనసాగుతాయని స్పష్టం చేశారు.

“ఇప్పుడు బ్యాంకుల వద్దకు వెళ్లడానికి కారణాలేం లేవు. మీకు సెప్టెంబర్ 30 వరకు నాలుగు నెలల సమయం ఉంది” అని ఆర్‌బిఐ గవర్నర్ చెప్పారు. నోట్లు మార్చుకోడానికి డెడ్‌లైన్ ఉందని, ప్రజలు దీనిని సీరియస్‌గా తీసుకుంటారని, తిరిగి ఇచ్చే ప్రయత్నం చేస్తారని అన్నారు. నోట్ల రద్దు తర్వాత డిమాండ్‌కు తగినట్టుగా ఉండేందుకు మాత్రమే తాము నాడు 2 వేల నోట్లను ప్రవేశపెట్టామన్నారు. రేపటి నుండి ₹ 2,000 బ్యాంకు నోట్ల మార్పిడికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని బ్యాంకులకు ఆర్బీఐ సూచించింది.