Home Page SliderTelangana

60 వేల జీతం కోసం 20 వేల లంచం

తెలంగాణలోని కరీంనగర్ జిల్లా జమ్మికుంట ఐకేపీ ఆఫీస్ లో ఏసీబీ రెయిడ్స్ చేశారు. లంచం తీసుకుంటూ కమ్యూనిటీ కో ఆర్డినేటర్ ఏసీబీకి చిక్కాడు. వీవోఏగా పనిచేస్తున్న స్వప్న తనకు రావాల్సిన రూ. 60 వేల జీతం ఇప్పించాలని కో ఆర్డినేటర్ సురేశ్ ను కోరింది. ఇందుకు 20 వేల లంచం ఇవ్వాలని సురేశ్ డిమాండ్ చేయగా.. బాధితురాలు ఏసీబీని ఆశ్రయించారు. ఈ క్రమంలో భాదితురాలి దగ్గర రూ.10 వేల లంచం తీసుకుంటూ సురేశ్ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ ఆఫీసర్లకు పట్టుబడ్డారు.