కల్తీ మద్యంతో 20 మంది మృతి
బిహార్‌లో మరోసారి కల్తీమద్యం కలకలం రేపింది. కల్తీమద్యం సేవించి, 20 మంది మృతిచెందారు. సివాన్, సారణ్ జిల్లాలలో ఈ ఘటన జరిగింది. అయితే బిహార్‌లో సంపూర్ణ మద్యనిషేధం అమలులో ఉండడం విశేషం. ఈ నెల 15 తేదీన ఈ జిల్లాలలో కొందరు కల్తీ మద్యం సేవించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, ముగ్గురిని అరెస్టు చేశారు. ఈ విషయంలో విక్రయాలపై చర్యలు తీసుకోలేదనే కారణంతో పంచాయితీకి చెందిన బీట్ పోలీస్ అధికారులను సస్పెండ్ చేశారు. 2016 ఏప్రిల్‌లో మధ్యనిషేధం అమలు చేస్తున్నప్పటి నుండి ఇక్కడ కల్తీ మద్యం విక్రయాలు జరుగుతున్న ఘటనలు చాలా వెలుగు చూస్తున్నాయి. ఏటా వందల మంది ప్రాణాలు కోల్పోతున్నారు.

