Andhra PradeshHome Page Slider

ఏపీలో టీడీపీ అధికారంలోకి వస్తే 20లక్షల ఉద్యోగాలు: చంద్రబాబు

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ అధికార పార్టీపై ప్రతిపక్ష పార్టీ నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మరోసారి సీఎం జగన్‌పై మండిపడ్డారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 8 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిందని ఆయన ఆరోపించారు. అయితే వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తే నూతన విద్యుత్ పాలసీని తీసుకువచ్చి ఛార్జీలు తగ్గిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.  అంతేకాకుండా ఏపీలో ఉన్న నిరుద్యోగ యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. కాగా ఏపీలో జాబు రావాలంటే బాబు రావాల్సిందేనని చంద్రబాబు వ్యాఖ్యానించారు . ఇవాళ కర్నూల్  నందికొట్కూరు సభలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సభలో ఆయన మాట్లాడుతూ..ఏపీలో సీఎం జగన్ బటన్ నొక్కడం కాదు..బుక్కుడు ఎక్కువైంది అని చంద్రబాబు మండిపడ్డారు. ఈ మేరకు సీఎం జగన్ ఏపీలో రూ.10/-రూపాయలు పంచుతూ..రూ.90/- రూపాయలు నొక్కేస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.