అనకాపల్లి జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం 20 మందికి గాయాలు
అనకాపల్లి నుండి పాయకరావుపేటకు వెళ్తున్న ఆర్టీసీ బస్సును వెనుక నుండి వచ్చే లారీ బలంగా ఢీకొట్టడంతో తీవ్ర ప్రమాదం సంభవించింది. అనకాపల్లి జిల్లాలోని ఎత్రాయిపల్లి మండలం ధర్మవరం వద్ద జాతీయ రహదారిపై ప్రయాణీకులను ఎక్కించుకోవడానికి ఆర్టీసీ బస్సు ఆగింది. ఆ సమయంలో వెనుక నుండి లారీ వస్తోంది. అది చాలా వేగంగా వస్తూ బస్సును ఢీకొట్టింది. ఆ బస్సులో దాదాపు 50 మంది ప్రయాణికులు ఉన్నారు. 20 మందికి తీవ్రగాయాలయ్యాయి. వారిని హుటాహుటిన స్థానికులు, పోలీసులు కలిసి ప్రభుత్వ ఆస్పత్రికి ఆటోల్లో తరలించారు. గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి ప్రమాదకరంగా ఉందని, వారిని విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. విశాఖకు చెందిన పరసయ్య అనే వ్యక్తి చికిత్స పొందుతూ మరణించారు.

