InternationalNews

పేలుళ్ళతో దద్దరిల్లిన కాబూల్ – 20 మంది మృతి

ఆఫ్ఘనిస్థాన్‌ రాజధాని కాబుల్‌ బాంబు పేలుళ్ళతో దద్దరిల్లింది. స్ధానికంగా ఉన్న ఓ మసీదులో జరిగిన భారీ పేలుళ్ళలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రార్ధనల తర్వాత ఈ పేలుడు జరగటంతో భారీ ప్రాణనష్టం సంభవించింది. పేలుడు తీవ్రత దృష్ట్యా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. తాలిబన్ నిఘా విభాగం అధికారులు కూడా దదాపు 35 మంది వరకు మరణించి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

ఉత్తర కాబుల్‌, ఖైర్‌ ఖానా ప్రాంతంలోని మసీదులో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పేలుడు ధాటికి సమీపంలోని భవనాల కిటికీల అద్దాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. మృతుల్లో మసీదు ఇమామ్‌ కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. నిఘా విభాగం బృందాలు సంఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తును ముమ్మరం చేశాయి. ఈ పేలుడుకు సంబంధించి ఇప్పటి వరకూ ఎవరూ బాధ్యత ప్రకటించుకోలేదు.