బర్తడే గిఫ్ట్‌గా 2 లీటర్ల పెట్రోల్ ఉచితం …ఎక్కడంటే
పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ రోజుల్లో పెట్రోల్ ఫ్రీగా ఇచ్చేదెవరా అనుకుంటున్నారా.. అనకాపల్లి జిల్లాలోని నక్కపల్లిలో ఓ పెట్రోల్ బంకులో రెండులీటర్ల పెట్రోల్ లేదా డీజిల్ 150 మందికి ఉచితంగా ఇస్తున్నట్లు ప్రచారం చేశారు. బంకు యజమాని జన్మదినం కారణంగా ఈ స్కీమ్ పెట్టాడు. ఉదయం 9 గంటల నుండి వచ్చే మొదటి 150 మందికి ఈ కూపన్లు వర్తిస్తాయి. అది కేవలం ఆటోలు, బైక్‌లకు మాత్రమే. దీనితో అక్కడ పెద్ద ఎత్తున జనం పోగయ్యారు. మాకంటే మాకంటూ తోసుకున్నారు. దీనితో పోలీసులు కలుగజేసుకుని, వారిని నియంత్రించవలసి వచ్చింది. చివరకు ఒక లైనులో కూపన్లు పంపిణీ చేయించి ఈ పెట్రోల్‌ను వాహనాలలో పోసారు. ఫ్రీగా వస్తే ఫినాయిల్ అయినా తాగేస్తారు కొందరు. ఇక పెట్రోల్ ఫ్రీగా ఇస్తే వదులుతారా?