తెలంగాణలో త్వరలో 2 లక్షల ఉద్యోగాల భర్తీ
తెలంగాణలో అతి త్వరలోనే 2 లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తామని ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ప్రకటించారు. త్వరలోనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని తెలిపారు. శాసనసభలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పరంగా అందరికీ ఉద్యోగాలు కల్పించడం సాధ్యం కాదు. గ్రాడ్యుయేట్లలో పరిశ్రమలకు కావలసిన నైపుణ్యాలు కొరవడ్డాయి. అందుకోసం వారిలో స్కిల్స్ పెంపుపై పారిశ్రామిక వేత్తలు, వీసీలు, విద్యార్థులతో చర్చించాం. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ స్థాపనకు ప్రతిపాదిస్తున్నాం అని ఆయన పేర్కొన్నారు.