2 కోట్లు ఇస్తా.. సర్పంచ్ గా ఎన్నుకోండి..
అలంపూర్ జోగులాంబ గద్వాల జిల్లాలోని ఎర్రవల్లి గ్రామ సర్పంచ్ గా తనను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే గ్రామపంచాయతీకి రూ.2కోట్లు ఇస్తానని ఓ వ్యక్తి ఆఫర్ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. పూల మద్దిలేటి అనే వ్యక్తి ఈ ఆఫర్ ఇచ్చినట్లుగా ఓ వాట్సాప్ పోస్ట్ స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తనను సర్పంచ్ ఏకగ్రీవం చేస్తే గ్రామ అభివృద్ధి కోసం రూ.2కోట్లు ఇస్తానని, దీనిపై గ్రామస్తులంతా ఆలోచించి తనకు సహకరించాలని కోరాడు.