దేశంలో 2.8 లక్షల ‘ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాలు’ ఏర్పాటు
రేపటి నుంచి ‘ప్రధాని కిసాన్ సేవ కేంద్రాలు’గా ఎరువుల రిటైల్ షాపులను మార్చుతున్నామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. దేశంలో 2.8 లక్షల దుకాణాలను కిసాన్ సమృద్ధి కేంద్రాలుగా అప్ గ్రేడ్ చేస్తామని తెలిపారు. తొలిదశలో 1.25 లక్షల షాప్ లని ప్రధాని రేపు ప్రారంభిస్తారని ఈ షాప్ ల్లో సల్ఫర్ కోటెడ్ యూరియా కూడా అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. వీటిద్వారా రైతులకు కావాల్సిన అన్ని రకాల సేవలను ఒకే చోట అందించడానికి కేంద్ర ప్రభుత్వం ఎరువుల రిటైల్ షాపులను ప్రధానమంత్రి కిసాన్ సేవా కేంద్రాలుగా రేపటి నుంచి మార్చబోతున్నది. ఎరువుల కోసం ఒక దగ్గరికి, భూసార పరీక్షలకు ఒక దగ్గరకు.. ఇలా అనేక చోట్లకు వెళ్లాల్సి వస్తున్నది. అలా కాకుండా రేపటి నుంచి రైతులకు కావాల్సిన అన్ని రకాల సేవలు.. కిసాన్ సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంటాయి. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు నిర్దేశిత ధరల్లో రైతులకు అందుబాటులో ఉంటాయి. భూసార పరీక్షలు, సీడ్ టెస్టింగ్ సౌకర్యాలు ఉంటాయి. కిసాన్ సేవా కేంద్రాలు రేపటి నుంచి అందుబాటులోకి వస్తాయి. తక్కువ ధరలకే ఎరువులు, విత్తనాలు, వ్యవసాయ పనిమొట్లు, కిసాన్ సమ్మాన్ యోజన లాంటి అనేక కార్యక్రమాలు చేస్తున్నది.

ఏ పంట వేయాలి? ఏ ఎరువు వాడాలనే దానిపై రైతులకు కిసాన్ సేవా కేంద్రాలు అవగాహన కల్పిస్తాయి. సీడ్ టెస్టింగ్తోపాటు, వ్యవసాయానికి ఉపయోగించే వాటర్‌ను కూడా టెస్టింగ్ కూడా దేశంలో మొదటిసారి రేపటి నుంచి అమల్లోకి తీసుకువస్తున్నాం. పంటల భీమా పథకం పట్ల బ్యాంకులను, రైతులను సమన్వయం చేసేందుకు అవగాహన కార్యక్రమాలు నడుస్తాయి. అమెరికాలో ఒక యూరియా బస్తాను రూ.3 వేలు చెల్లించి అక్కడి రైతు కొంటుంటే.. ఇండియాలో రైతు రూ.265కి కొంటున్నాడు. గత 9 ఏండ్లలో కనీస మద్దతు ధరను పెంచుతూ కేంద్రం రైతులను ఆదుకుంటున్నది. రైతుల ఇబ్బందులు, సమస్యలపై ఒకరికొకరు తెలుసుకునేందుకు ‘కిసాన్ కి బాత్’ రైతుల గ్రూప్ మీటింగ్ రేపటి నుంచి అమలు చేయబోతున్నాం. ప్రతి నెల రెండో అధివారం కిసాన్ కి బాత్ ఉంటుంది. రాష్ట్రంలో మార్పు రావాలంటే.. తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరాలంటే.. అవినీతి రహిత ప్రభుత్వం రావాలంటే.. అది మోడీ నాయకత్వంలోని బీజేపీతో మాత్రమే సాధ్యం. అందరూ ఈ విషయాన్ని గుర్తించాలంటూ పిలుపునిచ్చారు కిషన్ రెడ్డి.