జ్యూస్ తాగడానికి వెళితే.. మహిళకు 2.10 కోట్లు
ఆరెంజ్ జ్యూస్ తాగడానికి వెళితే అదృష్టం కలిసి వచ్చింది. అమెరికా నార్త్ కరోలినాలోని కెర్నర్స్ విల్లేకు చెందిన కెల్లీ స్పార్ అనే మహిళ ఆరెంజ్ జ్యూస్ తాగదానికి ‘క్వాలిటీ మార్ట్’ అనే షాప్ కి వెళ్లింది. జ్యూస్ తాగుతుండగా అక్కడే ఉన్న గ్యాస్ స్టేషన్ లోని లాటరీ టికెట్లపై ఆమె దృష్టి పడింది. వెంటనే తాగడం ఆపి.. అక్కడికి వెళ్లి 20 డాలర్లతో ఒక టికెట్ కు కొనుగోలు చేసింది. టికెట్ ను స్క్రాచ్ చేసి చూడగా ‘టాప్ ప్రైజ్ విన్నర్’ అని ఉంది. దీంతో ఆమె 2,50,000 డాలర్లు (సుమారు రూ.2.10 కోట్లు) గెలుచుకుంది. ఇంకేముంది.. ఆమె ఆనందంతో ఎగిరి గంతేసింది. ఆమెకు కలలో కూడా ఊహించనంత డబ్బు దక్కింది. ఈ డబ్బు తమ కుటుంబ స్వరూపాన్ని మార్చుతుందని, చాలా ఉపయోగపడుతుందని ఆమె హర్షం వ్యక్తం చేసింది.

