Andhra PradeshHome Page Slider

ఏపీలో మూతపడిన 180 డిగ్రీ కాలేజీలు

ఏపీలో ఉన్న ప్రైవేటు డిగ్రీ కాలేజీలపై ఏపీ ప్రభుత్వం దృష్టిసారించింది. ఈ మేరకు రాష్ట్రంలోని ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో సోదాలు నిర్వహించింది. దీంతో ఏపీ వ్యాప్తంగా ఉన్న 180 ప్రైవేటు డిగ్రీ కాలేజీలు మూతపడ్డాయి. అయితే వీటిలో 150 కాలేజీలకు కమిషన్ ఫీజు నిర్ణయించలేదని ప్రభుత్వం పేర్కొంది. కాగా మిగిలిన 30 కాలేజీలు బోధన ఫీజులు నిర్ణయించేందుకు కమిషన్‌కు ఆర్థిక వ్యవహారాలను సమర్పించకపోవడంతో మూసివేసినట్లు ఏపీ ప్రభుత్వం  వెల్లడించింది. కాగా ఏపీలో మొత్తం1008 డిగ్రీ కాలేజీలు ఉన్నాయి.