18 ఏళ్లు నిండినవారు అలర్ట్
తెలంగాణలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ప్రారంభమైంది. 2025 జనవరి 1 వరకు 18 ఏళ్లు నిండే వారు ఓటర్ల జాబితాలో పేరు నమోదు చేసుకోవచ్చు. అక్టోబర్ 10 వరకు బిఎల్ఓలు ఇంటింటి సర్వే, జాబితాలో ఫోటోల మార్పు, పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ చేపడతారు. ఓటరుగా పేర్లు నమోదు చేసుకున్న వారి వివరాలతో కలిపి అదే నెల 28లోగా ముసాయిదా జాబితాను రూపొందిస్తారు. అక్టోబర్ 29న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటిస్తారు. నవంబర్ 28 వరకు అభ్యంతరాలు స్వీకరించి, డిసెంబర్ 24 నాటికి పరిష్కరించి జనవరి 6న తుది ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ప్రకటిస్తుంది. ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పుల కోసం https://voters.eci.gov.in వెబ్ సైట్ లో ఆయా దరఖాస్తులు అందుబాటులో ఉంది.


 
							 
							