Andhra PradeshHome Page Slider

ఏపీలో మూడేళ్లలో పెరిగిన 18 లక్షల ఐటీ రిటర్న్స్, దేశంలోనే అత్యధికం

ఏపీ నుంచి ఇప్పటి వరకు వస్తున్న వార్తలకు భిన్నంగా వార్తా కథనం వెలుగులోకి వచ్చింది. ఏపీలో ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తున్న వ్యక్తులు, సంస్థలు దేశంలోనే అత్యధికమంటూ తేలింది. అసెస్‌మెంట్ సంవత్సరం 2020 – 2023 మధ్య అత్యధిక సంఖ్యలో కొత్త పన్ను దాఖలు చేసేవారి సంఖ్య ఏపీలో భారీగా పెరిగింది. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రగామిగా ఉంది. 2020- 2023 మధ్య, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసిన నివేదిక ప్రకారం ITR ఫైలింగ్‌లో అభివృద్ధి చెందుతున్న ట్రెండ్‌లలో కొత్త మధ్యతరగతి వర్గమంటూ పేర్కొంది. మహారాష్ట్రలో మూడేళ్లలో 13.9 లక్షలు, ఉత్తరప్రదేశ్‌లో 12.7 లక్షలు, గుజరాత్ 8.8 లక్షలు వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. ఈ కాలంలో తెలంగాణ ప్రతికూల వృద్ధిని సాధించింది. అన్ని రాష్ట్రాలలో 20వ స్థానంలో ఉంది. కర్నాటక, తమిళనాడు, కేరళ, దక్షిణాదిలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే, ఒక్కొక్కటి సగటున 3-4 లక్షల కొత్త ఐటీ రిటర్న్స్ పెరిగాయి.

ఆంధ్రప్రదేశ్ గణనీయమైన పెరుగుదలను నమోదు చేసింది. MSME సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమలు అభివృద్ధి ఇందుకు కారణమని చెప్పొచ్చు. ITR ఫైలింగ్‌లో మొత్తం పెరుగుదలలో 60%కి దోహదపడుతున్న మొదటి ఐదు రాష్ట్రాలు కూడా అన్ని Udyam రిజిస్ట్రేషన్‌లలో 45% వాటా ఉంది. ఆంధ్రప్రదేశ్ 6.6 లక్షల Udyam రిజిస్ట్రేషన్లు 4.1 లక్షల GST రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. అయితే, ITR ఫైలింగ్ పాన్ కార్డ్ చిరునామాపై ఆధారపడి ఉంటుందని గమనించాలి. ఇది వ్యక్తి ప్రస్తుత పని స్థలాన్ని ప్రతిబింబించకపోవచ్చు. స్లమ్ పాలసీ ప్రయోజనాలు GST, ITR ఫైల్ చేసే వారికి కాదు.