16వ ఆర్థిక సంఘం సమావేశం
రాష్ట్రంలో 16 వ ఆర్థిక సంఘం నేడు, రేపు సమావేశాలు జరగనున్నాయి. ప్రజా భవన్లో నేడు 16 వ ఆర్థిక సంఘం సమావేశం ప్రారంభం అయ్యాయి. ఈ సమావేశంలో ఆర్థిక సంఘం చైర్మన్ డా. అర్వింద్ పనగారియా, సభ్యులు అజయ్ నారాయణ్ జా, అన్నీ జార్జ్, మనోజ్ పాండా, సౌమ్య కాంతి ఘోష్, సంఘం కార్యదర్శి రిత్విక్ పాండే లతో సమావేశం అయిన పలు మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయితీల ప్రతినిధులు. ఫైనాన్స్ శాఖ ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణ రావు, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్, జీహెచ్ ఎంసీ కమీషనర్ ఆమ్రపాలి, జలమండలి ఎం.డి అశోక్ రెడ్డి, హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమీషనర్ అశ్విని , నిజామాబాద్ మేయర్ నీతూ కిరణ్, ఫీర్జాదిగూడా మేయర్ అమర్‌సింగ్, బాదంగా పేట మేయర్ చిగురింత పారిజాత, మెదక్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ లతో కలిపి 17 మున్సిపాలిటీల సభ్యులు పాల్గొన్నారు.

