NewsTelangana

నల్గొండ జిల్లా అభివృద్ధికి రూ.1,544 కోట్లు

నల్గొండ జిల్లాలో రానున్న 6నెలల్లో భారీగా అభివృద్ధి పనులు చేపడతామని మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. మునుగోడు అభివృద్ధిపై ఆయన సమీక్షించారు. ‘‘నల్గొండ జిల్లాలో రూ.1,544 కోట్లు ఖర్చు చేయనున్నాం. తండాల్లో రూ.100 కోట్లతో అభివృద్ధి పనులు చేపడతాం. పంచాయతీరాజ్‌ శాఖలో రూ.175 కోట్లు ఖర్చు చేయనున్నాం. రూ.100 కోట్లతో రోడ్లన్నీ బాగు చేస్తాం. మునుగోడులో 100 పడకల ఆస్పత్రి, 5 కొత్త సబ్‌స్టేషన్లు నిర్మిస్తాం. చండూరు మున్సిపాలిటీకి రూ.50 కోట్లు, చౌటుప్పల్‌కు రూ.30 కోట్లు మంజూరు చేస్తాం’’ అని కేటీఆర్‌ వెల్లడించారు.