15 Years back సల్మాన్ ఖాన్‌తో వాంటెడ్ సినిమా తీసిన బోనీ కపూర్
15 ఏళ్ల క్రితం వాంటెడ్ సినిమా కోసం బోనీ కపూర్ సల్మాన్ ఖాన్‌ను ఎలా ఒప్పించాడో షేర్ చేశారు. సల్మాన్ ఖాన్ బ్లాక్ బస్టర్ సినిమా వాంటెడ్‌కు నేటితో 15 ఏళ్లు కంప్లీట్ అయ్యాయి. పాత ఇంటర్వ్యూలో, సినిమా నిర్మాత బోనీ కపూర్, ఆ పాత్రలో నటించమని ఒప్పించడానికి అతను పడ్డ కష్టం, అతను అర్ధరాత్రి సూపర్‌స్టార్‌ను ఎలా కలిశాడో వెల్లడించాడు. వాంటెడ్ తన 15వ వార్షికోత్సవాన్ని ఈరోజు సెప్టెంబర్ 18న జరుపుకుంది. సినిమా నిర్మాత బోనీ కపూర్, సల్మాన్ ఖాన్‌ని ఆ పాత్ర కోసం ఎలా ఒప్పించాడో వెల్లడించారు. తెలుగు సినిమా పోకిరి – హిందీలో రీమేక్ చేసి వాంటెడ్‌గా తీశారు. సల్మాన్ ఖాన్, అయేషా టకియా బ్లాక్ బస్టర్ చిత్రం వాంటెడ్‌లో నటించారు. డ్యాన్స్-రియాలిటీ టీవీ షో, ఝలక్ దిఖ్లా జా 11లో కనిపించిన సందర్భంగా, చిత్ర నిర్మాత బోనీ కపూర్ అర్ధరాత్రి సూపర్‌స్టార్‌ని ఎలా కలిసి కన్విన్స్ చేశారో తెలిపారు. అతను ఆ పాత్రను ఒప్పుకుని చేయడం, ప్రభుదేవా దర్శకత్వం వహించిన వాంటెడ్ సల్మాన్ ఖాన్ సినీ కెరీర్‌లో ఒక మైలురాయిగానే చెప్పుకోవచ్చు.
ఝలక్ దిఖ్లా జా 11 ప్రత్యేక ఎపిసోడ్ కోసం బోనీ కపూర్‌ను అతిథిగా ఆహ్వానించారు. ఎపిసోడ్ సమయంలో, వాంటెడ్‌లోని మేరా హి జల్వా పాటకు పోటీదారుల్లో ఒకరు డ్యాన్స్ చేశారు. ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తరువాత, బోనీ కపూర్ సల్మాన్ ఖాన్‌ను సినిమాలో ప్రధాన పాత్రలో నటించమని ఒప్పించేందుకు తాను కష్టపడిన సమయం గురించి వ్యక్తిగత వృత్తాంతం షేర్ చేశారు. 2007లో తాము ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్‌ను డెవలప్ చేయడం ప్రారంభించామని బోనీ కపూర్ షేర్ చేశారు. ఆ సమయంలో, బాలీవుడ్‌లో ఫ్యామిలీ డ్రామాల ఆధిపత్యం ఉండేది, ఈ ప్రాజెక్ట్‌తో యాక్షన్ జానర్‌ను పునరుద్ధరించాలని అతను కోరుకున్నాడు. నేను సినిమా తీయాలని నిర్ణయించుకున్నాను, నేను సల్మాన్ ఖాన్‌తోనే సినిమా తీయాలని అనుకుంటున్నాను, అని చెప్పి బోనీ చేతులు జోడిస్తూ చెప్పారు.
మహేష్ బాబు నటించిన తెలుగు సినిమా పోకిరి హక్కులను తమ బృందం కొనుగోలు చేసిందని బోనీ కపూర్ వివరించారు. అతను రెండుసార్లు సల్మాన్ ఖాన్‌కి సినిమాను ఆఫర్ చేయడానికి ప్రయత్నించాడు, కానీ నటుడి బిజీ షూటింగ్ షెడ్యూల్ కారణంగా ఆయన్ని మీట్ అవ్వలేకపోయాడు. తర్వాత మూడవ రోజు, నేను అతని వద్దకు వెళ్లి, సల్మాన్, నేను ఈ సినిమా తర్వాత ఎప్పటికీ మిమ్మల్ని కలవను, మీకు ఈ సినిమా నచ్చకపోతే, నేను మీకు మరో సినిమాని అందించే ప్రయత్నం కూడా చేయను, మీరు రండి. ఈ సినిమా చూడండి అప్పుడు మీ అభిప్రాయం చెప్పండి అన్నాను. 2009లో విడుదలైన వాంటెడ్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. తెలుగులో మహేష్ బాబు, ఇలియానా డిక్రూజ్ నటించిన పోకిరి చిత్రానికి ఇది రీమేక్. ఆ సంగతి మీకు తెలిసిందే.

