15 నుంచి ఒంటిపూట బడులు
తెలంగాణలో ఈ నెల 15 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రకటించారు.ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలల్లో ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు నిర్వహించనున్నారు.పదోవ తరగతి పరీక్షలు జరిగే స్కూళ్లల్లో మాత్రం మధ్యాహ్నం పూట క్లాసులు జరుపుతామని విద్యాశాఖ ప్రకటించింది.ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా అదనపు తరగతులు నిర్వహించినా,విద్యార్ధులను ఒత్తిడికి గురిచేసే ఎలాంటి తరగతులు చేపట్టినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.కాగా ఏప్రిల్ 23 నుంచి వేసవి సెలవులు ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.