Andhra PradeshNews

తిరుమల శ్రీవారి సంపద… 15 వేల కోట్ల డిపాజిట్లు, 10 టన్నుల బంగారం

తిరుమల శ్రీవారి ఆదాయం రోజు రోజుకు పెరుగుతోంది. స్వామి సంపాదన గత మూడేళ్లలో దూసుకుపోతోంది. స్వామి బంగారం 10 టన్నులంటూ టీటీడీ శ్వేతపత్రం విడుదల చేసింది. శ్రీవారికి హుండీ ద్వారా వచ్చిన బంగారు కానుకలను కరిగించి, శుద్ధి చేసి 12 ఏళ్లపాటు పెట్టుబడులు పెట్టేందుకు భారత ప్రభుత్వ మింట్ కు పంపిస్తున్నామన్నారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి. ఇక ప్రభుత్వ బ్యాంకుల్లో 15,938.68 కోట్ల రూపాయలు ఉన్నట్టుగా టీటీడీ పేర్కొంది. సుమారుగా టీటీడీ డిపాజిట్లు 16 వేలకోట్లుగా ఉన్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 30-6-2019 నాటికి 5,387.56 కోట్లు ఉండగా.. అది 30-09-2022 నాటికి ఆ మొత్తం 9,819.38 కోట్లుగా ఉంది. ఇక ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంకులో 1952.18 కోట్ల మొత్తం 438.88 కోట్లుగా ఉంది. మొత్తం జూన్ 30, 2019 నాటికి 7,339.74 కోట్ల మొత్తం.. ప్రస్తుతం 10,258.37 కోట్లకు చేరింది. ఇక మిగతా అన్నీ బ్యాంకుల్లో 13,025 కోట్ల మొత్తం 15,938.68 కోట్లకు చేరుకొంది. తాము ఏ ప్రభుత్వానికి ఇప్పటి వరకు డబ్బులివ్వలేదన్నారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి. డయర్ యువర్ ఈవో కార్యక్రమంలో భక్తుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ వివరాలు వెల్లడించారు. వడ్డీ ఎక్కువ వచ్చే బ్యాంకుల్లో మాత్రమే డిపాజిట్లు చేస్తున్నామని.. ఏ ప్రభుత్వ సెక్యురిటీ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టలేదన్నారు.