న్యూడ్ వీడియోకాల్‌తో వృద్ధుడి వద్ద 15 లక్షల దోపిడి
సైబర్ క్రైమ్ రోజురోజుకీ వెర్రిపుంతలు తొక్కుతోంది. న్యూడ్ వీడియోకాల్ చేసి, ఒక వృద్ధుడి వద్ద మోసం చేసి, 15 లక్షల రూపాయలు దోచేసిన ఘటన ఇటీవల హైదరాబాద్‌లో జరిగింది. 79 ఏళ్ల వృద్ధుడు ఈ వీడియో కాల్ బారిన పడి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 79 ఏళ్ల వ్యక్తికి ఒక వీడియోకాల్ వచ్చింది. దానిని రిసీవ్ చేసుకున్న అతడితో అవతల అమ్మాయి కనిపించి మాట్లాడడం మొదలు పెట్టింది. మాట్లాడుతూనే న్యూడ్‌గా మారి అతడిని కూడా డ్రెస్ తొలగించమని కోరింది. అలాగే చేసిన అతడి వీడియోను స్క్రీన్ రికార్డు చేసింది. అనంతరం ఆ వీడియో చూపించి అతడికి టార్చర్ మొదలు పెట్టారు. 15 లక్షల రూపాయలు అతని వద్ద వసూలు చేశారు. ఇలాంటి కాల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని స్రైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. తెలియని వ్యక్తుల వద్ద నుండి వచ్చిన వీడియో కాల్స్ రిసీవ్ చేసుకోవద్దని, మాట్లాడినా కెమెరా ఆఫ్‌లో పెట్టుకోవాలని సూచిస్తున్నారు. వారి లిప్ మూమెంట్ గమనించాలని, చాలా సందర్భాలలో కేవలం వీడియో మాత్రమే వస్తూ, బ్యాక్ గ్రౌండ్‌లో మాటలు రావడాన్ని గమనించాలని తెలియజేశారు.