హైదరాబాద్‌లో వీధికుక్కల వీరంగం..మహిళపై 15 కుక్కలు దాడి
హైదరాబాద్‌లో వీధికుక్కల దాడులు ఎక్కువవుతున్నాయి. మణికొండలో చిత్రపురి కాలనీలో కార్ పార్కింగ్ వద్ద స్కూటీపై వస్తున్న ఒక మహిళపై ఏకంగా 15 వీధి కుక్కుల దాడికి ఎగబడ్డాయి. ఆ వీధి నిర్మానుష్యంగా ఉండడంతో అరగంట సేపు ఆమె వాటితో పోరాడవలసి వచ్చింది. చివరికి మరొకరు రావడంతో వాటి బారి నుండి తప్పించుకుని స్కూటీపై వెళ్లగలిగింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు అధికారులను విమర్శిస్తున్నారు. ఎప్పుడైనా ఘోరం జరిగినప్పుడే స్పందిస్తారని, మళ్లీ పట్టించుకోరని ఆరోపణలు చేస్తున్నారు. గతంలో కూడా అదే వీధిలో తల్లీ,బిడ్డలపై వీధికుక్కలు దాడి చేశాయని గుర్తు చేస్తున్నారు. ఇకనైనా నివారణ చర్యలు చేపట్టకపోతే పిల్లలు, మహిళల ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని, వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.