home page sliderHome Page SliderNational

కల్తీ మద్యం తాగి 14 మంది మృతి

పంజాబ్ రాష్ట్రంలో ఘోరం జరిగింది. కల్తీ మద్యం తాగి 14 మంది మృతి చెందగా మరో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన గత రాత్రి అమృత్సర్ జిల్లాలోని మజితా ప్రాంతంలో చోటు చేసుకుందని ఎస్ఎస్పీ మనీందర్ సింగ్ తెలిపారు. కల్తీ మద్యం ప్రధాన సరఫరాదారు పరబ్లీత్సింగ్ ను అరెస్టు చేశామన్నారు. ఈ ఘటనపై పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. దోషులను కఠినంగా శిక్షిస్తామని, ఈ ఘటనపై లోతైన విచారణ జరిపించాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు.