Breaking NewsHome Page Sliderhome page sliderTelangana

ఐబొమ్మ రవికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని పోలీసులు నాంపల్లి కోర్టులో బుధవారం హాజరు పరిచారు. విచారణ తర్వాత కోర్టు ఆయనను 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపింది. రవిపై మొత్తం ఐదు కేసులు నమోదు కాగా, వాటిలో ఒక కేసులో ఇప్పటికే ఐదు రోజుల పోలీస్ కస్టడీ పూర్తైంది. మిగతా మూడు కేసుల్లో సైబర్ క్రైమ్ పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేశారు. ఇదిలా ఉండగా, రవి కస్టడీ పిటిషన్‌పై కోర్టు తీర్పు కాసేపట్లో వెలువడనుంది. ఇదివరకే ఐదు రోజుల కస్టడీలో రవి నుంచి కీలక సమాచారాన్ని సీసీఎస్ పోలీసులు సేకరించినట్లు తెలిపారు. రవి వద్ద ఉన్న హార్డ్‌డిస్కుల్లో వేల కొద్దీ సినిమాలు ఉన్నట్లు దర్యాప్తులో బయటపడింది. టెలిగ్రామ్ ద్వారా పైరసీ సినిమాలను కొనుగోలు చేసి వాటిని ఐబొమ్మ , బెప్పం టీవీ వెబ్‌సైట్లలో అప్‌లోడ్ చేసినట్లు పేర్కొన్నారు. సినిమాలు చూడడానికి సైట్లను ఓపెన్ చేసిన వినియోగదారులకు APK లింకులు పంపి బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేస్తూ కోట్ల రూపాయలు సంపాదించినట్లు పోలీసులు తెలిపారు.