NewsTelangana

తెలంగాణాలో 13 కొత్త మండలాలు

తెలంగాణ రాష్ట్రంలో మరో 13 కొత్త మండలాలు ఏర్పడ్డాయి. గతంలోనే ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీ చేసిన ప్రభుత్వం.. ప్రజల నుంచి అభ్యంతరాలు, వినతులు స్వీకరించిన తర్వాత సోమవారం 13 కొత్త మండలాలను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ జిల్లాల ఏర్పాటు చట్టం (1974లోని సెక్షన్‌ 3) ప్రకారం కొత్త మండలాలు సెప్టెంబరు 26వ తేదీ నుంచి ఉనికిలోకి వస్తాయని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 607 మండలాలు ఉన్నాయి. కొత్తగా ఏర్పాటైన వాటితో కలిసి ప్రస్తుతం తెలంగాణాలో రెవెన్యూ మండలాల సంఖ్య 620కి పెరిగింది.

కొత్త మండలాలు.. ఎండపల్లి (13 గ్రామాలు), భీమారం (9 గ్రామాలు), నిజాంపేట (9 గ్రామాలు), గట్టుప్పల (6 గ్రామాలు), డోంగ్లీ (15 గ్రామాలు), సీరోల్‌ (6 గ్రామాలు), ఇనుగుర్తి (5 గ్రామాలు), కౌకుంట్ల (9 గ్రామాలు), ఆలూరు (7 గ్రామాలు), డొంకేశ్వర్‌ (12 గ్రామాలు), సాలూర (10 గ్రామాలు), అక్బర్‌పేట-భూంపల్లి (13 గ్రామాలు), కుకునూర్‌పల్లి (15 గ్రామాలు).