పండగ పూట 120 మంది విద్యార్ధులకు అస్వస్ధత
వికారాబాద్ జిల్లా కుల్కచర్ల గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో కలుషిత నీరు తాగి 120 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారందరినీ హుటాహుటిన స్ధానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై స్పందించిన ఓ వ్యక్తి పరిస్ధితిని వివరిస్తూ మంత్రి కేటీఆర్ కు ట్వీట్ చేశాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను కూడా షేర్ చేశాడు. దీనిపై జిల్లా కలెక్టర్ నిఖిలకు మంత్రి కేటీఆర్ ఆదేశాలిస్తూ వెంటనే విద్యార్ధులు సమస్యలు పరిష్కరించాలని అన్నారు. అలాగే స్ధానిక శాసన సభ్యుడు మహేశ్ రెడ్డిని కూడా విద్యార్ధుల వసతుల కల్పన అంశాలని పర్యవేక్షించాలని ఆదేశించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్ధుల ఆరోగ్య పరిస్ధితిని అడిగి తెలుసుకున్నారు. అయితే ఈ వ్యవహారానికి సంబంధించి విద్యా శాఖపై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


