116 ఏళ్ల టోమికో ఇతోకా ఇకలేరు
ప్రపంచంలోనే వృద్ధ మహిళగా రికార్డు కెక్కిన జపాన్ చెందిన మహిళ ‘టోమికో ఇతోకా (116)’ వృద్ధాప్య సమస్యలతో మృతి చెందారు. ఆమె 1908లో జన్మించారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో ఈమె పేరు నమోదు కావడంతో గతేడాది ఆమె జన్మదిన వేడుకలను ఘనంగా చేశారు. ఆమె 1979లో భర్త చనిపోగా, నర అనే నగరంలో ఒంటరిగా జీవిస్తున్నారు. ఆమె అరటి పళ్లు, కాల్పిస్ అనే శీతల పానీయం చాలా ఇష్టమని చెప్పారు. 3 వేల మీటర్ల ఎత్తైన ‘ఆన్‌టేక్’ శిఖరాన్ని రెండుసార్లు పెద్ద వయసులో అధిరోహించి రికార్డు సాధించారు. ఆమెకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు సంతానం. ఆమె చనిపోవడంతో ఆమె కన్నా 16 రోజులు వయసు తక్కువున్న బ్రెజిల్‌కు చెందిన 116 ఏళ్ల ‘కెనబర్రో లుకాస్’ జీవించి ఉన్న అత్యంత వృద్ధ మహిళగా పేరు పొందారు.