InternationalNews

 కరాచీలో రేషన్ కోసం ఎగబడి 11 మంది మృతి

పాకిస్తాన్‌ పరిస్థితి ఆకలి రాజ్యంగా తయారయ్యింది. పాక్ పోర్టు సిటీగా పేరుపొందిన కరాచీలో రంజాన్ నెల  సందర్భంగా రేషన్ విడుదల చేసింది ప్రభుత్వం. గోధుమ పిండిని పంపిణీ చేస్తుండగా, ఇద్దరు వ్యక్తులు కరెంటు తీగపై కాలు పెట్టడంతో షాక్‌కు గురయ్యారని, వారు తోసివేయడంతో కంగారు పడి తొక్కిసలాట మొదలయ్యిందన తెలుస్తోంది.  మొదలైన తొక్కిసలాట ప్రాణాంతకంగా మారింది. దీనిలో 11మంది మరణించారు. వీరిలో పిల్లలు, మహిళలు కూడా ఉన్నారు. చాలామంది ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నారు. ఉచిత రేషన్ పంపిణీ కేంద్రాలలో చాలా చోట్ల తొక్కిసలాటలు జరుగుతున్నాయని ఇప్పటి వరకూ దాదాపు 22 మంది కొన్ని వేర్వేరు ప్రదేశాలలో మరణించారని తెలుస్తోంది.