నిమిషంలో 11 వాయిద్యాలు.. ‘ఇదేం టాలెంట్ బ్రో’..
కేవలం ఒక్క నిమిషంలోనే 11 వాయిద్యాలు వాయించి ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రాను మెప్పించారు గాయకుడు రాఘవ్ సచార్. “ఇదేం టాలెంట్ బ్రో..సూపర్” అంటూ ఆశ్చర్యపోయారు మహీంద్రా. అసమాన ప్రతిభను కనపరిచిన రాఘవ్ వీడియోను సోషల్ మీడియోలో షేర్ చేస్తూ ఆశ్చర్యపోయారు ఆనంద్ మహీంద్రా. “దిల్ చాహతా హై” అనే పాటను ఒకే ఒక్క నిమిషంలో 11 రకాల వాయిద్యాలతో టైటిల్ ట్రాక్‌ను వాయించి, వీక్షకులను మైమరపించారు రాఘవ్. “శాక్సోఫోన్, వేణువు, హ్యాండ్ ప్యాన్, కీబోర్డు” లాంటి పలు రకాల వాయిద్యాలను అవలీలగా వాయించారు. ఇప్పటి వరకూ 150 చిత్రాలలో తన వాయిద్యాలను అందించి పలు అవార్డులు సొంతం చేసుకున్నారు. ఏఆర్ రెహమాన్, విశాల్ శేఖర్, సలీం, అనుమాలిక్ వంటి గొప్ప సంగీత దర్శకులతో కలిసి పనిచేశారు. సోను నిగమ్, శంకర్ మహదేవన్, సునిధి చౌహాన్, శ్రేయా ఘోషల్ వంటి గాయకులతో కలిపి రికార్డింగులలో పాల్గొన్నారు. స్వయంగా కొన్ని చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు. పరిణీత, సలామ్ నమస్తే, ధూమ్, కల్, కల్ హో నాహో, డాన్ వంటి చిత్రాలకు పనిచేశారు.

